సినిమా అప్డేట్: వంద మంది జానపద కళాకారులతో ఎల్లమ్మ టైటిల్ సాంగ్
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
ప్రముఖ దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న ఎల్లమ్మ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రంలో రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ నటుడిగా అరంగేట్రం చేస్తున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన వంద మంది సంప్రదాయ జానపద రిథమ్ ప్లేయర్లతో శక్తివంతమైన టైటిల్ సాంగ్‌ను రికార్డ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు వారు స్పష్టం చేశారు.