విజయవాడలో ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీకి రంగం సిద్ధం

రిపోర్టర్: అశోక్ స్థలం: విజయవాడ

విజయవాడలో దశాబ్దాల ఇళ్ల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ ఈ నెల 30న 24,057 కుటుంబాలకు క్రమబద్ధీకరణ పట్టాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ హయాంలో ఇచ్చిన పట్టాలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పేదల ఆస్తులకు శాశ్వత భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు. ఒక్కో కుటుంబానికి సుమారు నలభై నుంచి నలభై ఐదు లక్షల రూపాయల వరకు ప్రయోజనం చేకూరనుందని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు ఈ పట్టాలు అందనున్నాయి.