జంగారెడ్డిగూడెంలో మత్తు ఇంజెక్షన్ల గుట్టు రట్టు.. యజమాని అరెస్ట్
రిపోర్టర్: fast news
స్థలం: జంగారెడ్డిగూడెం
జంగారెడ్డిగూడెంలో అక్రమంగా మత్తు ఇంజెక్షన్లు విక్రయిస్తున్న శ్రీ లక్ష్మి శ్రీనివాస మెడికల్ ఏజెన్సీ యజమాని కిషోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మెడికల్ లైసెన్స్‌ను దుర్వినియోగం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా మత్తు ఇంజెక్షన్లు అమ్ముతున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.
తనిఖీల్లో భాగంగా డాంగే నగర్‌లోని ఓ వర్క్‌షాప్‌లో దాచిన 7,550 ఇంజెక్షన్లతో పాటు మొత్తం 20 వేల ఇంజెక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, రికార్డులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.