ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం పాకాల: బయోడైవర్సిటీ పార్కులో సందర్శకుల సందడి

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

వరంగల్ జిల్లా నర్సంపేట సమీపంలోని చారిత్రక పాకాల బయోడైవర్సిటీ పార్కు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చుట్టూ దట్టమైన పచ్చదనం, అద్భుతమైన చెరువు, విదేశీ వలస పక్షుల కిలకిలారావాలు ప్రకృతి ప్రేమికులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బటర్ఫ్లై పార్కు, బోటింగ్, సైక్లింగ్ సదుపాయాలు పర్యాటకులను ఎంతగానో అలరిస్తున్నాయి. అరుదైన వన్యప్రాణులు, విభిన్న జీవజాతులకు నిలయమైన పాకాల అభయారణ్యం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం వేళ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.