మత్స్య ఎగుమతులతో కళకళలాడుతున్న నిజాంపట్నం తీరం: వేలాది మందికి ఉపాధి

రిపోర్టర్: రమేష్ స్థలం: బాపట్ల

బాపట్ల జిల్లాలోని నిజాంపట్నం తీరం సముద్ర ఉత్పత్తుల ఎగుమతికి ప్రధాన కేంద్రంగా నిలుస్తోందని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. ఇక్కడి నుంచి ప్రతిరోజూ ముప్పై టన్నుల వరకు చేపలు, రొయ్యలు దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా అవుతున్నాయని వారు పేర్కొన్నారు. దీనివల్ల వేలాది మంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తోందని, రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతోందని అధికారులు వెల్లడించారు.