స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల జోరు: తొలిరోజే భారీగా దాఖలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: అమరావతి
మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ తొలిరోజు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా ప్రారంభమైందని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఎంపీటీసీ స్థానాలకు గాను తొలిరోజే ఐదు వేల రెండు వందల అరవై ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే ఆరు వందల యాభై తొమ్మిది జడ్పీటీసీ స్థానాలకు నూట తొమ్మిది నామినేషన్లు అందినట్లు అధికారులు స్పష్టం చేశారు.