పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటం ఫలించి స్కిల్ యూనివర్సిటీ విలీనం రద్దు
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీన ప్రతిపాదనను కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. విద్యార్థుల తీవ్ర నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నట్లు సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. శాఖలో ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియకు బ్రేక్ పడింది. పాత పద్ధతిలోనే పాలిటెక్నిక్ విద్య కొనసాగనుండగా, రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజీ వద్ద జరిగిన ఘర్షణలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.