బీహార్ లో మైనర్ విద్యార్థినిపై వేధింపులు ముగ్గురి అరెస్ట్

రిపోర్టర్: రాము స్థలం: బీహార్

బీహార్ లోని జమూయ్ జిల్లాలో పదవ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థినిని కొందరు యువకులు రోడ్డుపై వేధించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కోచింగ్ ముగించుకుని స్కూటర్ పై వస్తున్న విద్యార్థినీ విద్యార్థులను అడ్డగించిన దుండగులు, బాలికను చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జమూయ్ ఎస్పీ విశ్వజీత్ దయాల్ స్పందించి సుమోటోగా కేసు నమోదు చేశారు. బాధితులను గుర్తించి పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, ఇప్పటివరకు ఏడుగురిని గుర్తించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.