మూకుతి అమ్మన్ 2 గ్రాఫిక్స్ పై వస్తున్న విమర్శలను ఖండించిన దర్శకుడు సుందర్
రిపోర్టర్: గోపి
స్థలం: చెన్నై
సినిమాలోని గ్రాఫిక్స్ పై వస్తున్న ఆరోపణలను దర్శకుడు సుందర్ తీవ్రంగా ఖండించారు. చెన్నైలో జరిగిన ఆడియో లాంచ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మూడు వేల గ్రాఫిక్స్ షాట్లలో కేవలం పదిహేను చోట్ల మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వాడామని ఆయన స్పష్టం చేశారు. వందలాది మంది కళాకారులు ఏడాదిన్నర కాలం పాటు కష్టపడి ఈ విజువల్స్ రూపొందించారని, వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడం బాధాకరమని సుందర్ తెలిపారు.