దక్షిణ తెలంగాణకు తీపి కబురు: నార్లాపూర్ పంప్‌హౌస్‌లో రెండు మోటార్లు ప్రారంభం
రిపోర్టర్: విజయ్
స్థలం: Nagarkurnool
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లాలోని నార్లాపూర్ పంప్‌హౌస్‌లో రెండు బాహుబలి మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసే ప్రక్రియను ప్రారంభించినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. శ్రీశైలం వెనుక జలాల నుంచి నార్లాపూర్ రిజర్వాయర్లలోకి నీటిని మళ్లించే ఈ చారిత్రక ఘట్టంతో దక్షిణ తెలంగాణ సాగునీటి అవసరాలు తీరనున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల రైతాంగానికి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి.