ఐసీసీ కమ్యూనికేషన్స్ విభాగ బాధ్యతలు చేపట్టిన ప్రభాకరన్ థనరాజ్
రిపోర్టర్: రాము
స్థలం: New Delhi
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా మార్కెటింగ్, బిజినెస్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకరన్ థనరాజ్ తాజాగా ఐసీసీ కమ్యూనికేషన్స్ విభాగ బాధ్యతలను అదనంగా చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది జనవరిలో ఐసీసీలో చేరిన ఆయనకు బీసీసీఐ, ఏసీసీలలో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ వ్యాప్తికి, క్రీడాభివృద్ధికి ఈ మార్పులు ఎంతగానో దోహదపడతాయని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.