హైదరాబాద్ లో భారీ వర్షాలు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కూకట్ పల్లి, అంబర్ పేట, కోఠి తదితర ప్రాంతాల్లో రోడ్లు జలమయమై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాష్ట్రంలో రానున్న రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించి మున్సిపల్ కమిషనర్లు, హైడ్రా, పోలీసు అధికారులను అప్రమత్తం చేస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.