సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కవిత డిమాండ్
రిపోర్టర్: నరేష్
స్థలం: తెలంగాణ
అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం సందర్భంగా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం మరియు చట్టాలు హామీ ఇచ్చినప్పటికీ, వేతనాల్లో లింగ వివక్ష ఇంకా కొనసాగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అదే పని గంటలు, అదే బాధ్యతలు ఉన్నప్పటికీ మహిళలకు తక్కువ వేతనం ఇవ్వడం అన్యాయమని పేర్కొన్నారు. మహిళల శ్రమకు తగిన విలువ, వేతనాల్లో పారదర్శకత ఉండాలని, సమాన పనికి సమాన వేతనం అందించే దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.