అమీర్పేట్ లో వాటర్ ట్యాంకర్ల నిలిపివేత: హాస్టళ్ల బంద్ కు ఓనర్స్ హెచ్చరిక

రిపోర్టర్: రాము స్థలం: Hyderabad

అమీర్పేట్ లో ప్రైవేట్ హాస్టళ్లకు వాటర్ ట్యాంకర్ల సరఫరా నిలిపివేయడంతో హాస్టల్ యజమానులు ఎస్ఆర్ నగర్ వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారని అసోసియేషన్ అధ్యక్షులు రాజారావు పేర్కొన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నీటి ట్యాంకర్లను నిలిపివేయడంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకపోతే తక్షణమే హాస్టళ్లను మూసివేస్తామని, నగరవ్యాప్తంగా ఆందోళన చేపడతామని ప్రభుత్వంపై యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.