మా భూములు గుంజుకుంటే మేం విషం పోసుకొని చావాలా

రిపోర్టర్: రాజేష్ స్థలం: Telangana

తెలంగాణలోని ఎర్రవెల్లిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సర్వేను స్థానిక దళిత రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు భూములతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ, తమ బతుకులను ఆగమాలు చేయొద్దని రేవంత్ సర్కార్‌ను హెచ్చరించారు.