ఘోర ప్రమాదం: లోయలో బస్సు వేలాడిన ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు

రిపోర్టర్: వెంకట్ స్థలం: Pauri

ఉత్తరాఖండ్లోని పౌరీ జిల్లాలో టెక్నికల్ సమస్య కారణంగా అదుపుతప్పిన ఒక బస్సు లోయలోకి దూసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. అయితే మార్గమధ్యంలో ఒక చెట్టు అడ్డుగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని, బస్సులో ఉన్న ప్రయాణికులు సాహసించి వెంటనే కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని, ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోందని రెస్క్యూ సిబ్బంది వెల్లడించారు.