హైదరాబాద్ ఐటీ జోన్లో భారీ ట్రాఫిక్ తిప్పలు: ప్రత్యేక వన్ వే లూప్ ప్రతిపాదన
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ ఐటీ కారిడార్లో వాహనాల రద్దడిని తగ్గించేందుకు సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక వన్ వే లూప్ విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి నాలెడ్జ్ సిటీ వరకు ఈ నిరంతర ప్రయాణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఐటీ ఉద్యోగుల ప్రయాణ ఇబ్బట్లను తొలగించి, రద్దడి వేళల్లో సమయం ఆదా చేసేలా ఈ నూతన ప్రణాళికను రూపొందించినట్లు సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.