పొంగులేటికి విశ్వసనీయత లేదు: కందాళ ఉపేందర్ రెడ్డి
రిపోర్టర్: kasanivenkatesh
స్థలం: నేలకొండపల్లి
నేలకొండపల్లిలో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయ ఎదుగుదలకు సహకరించిన నాయకుల పట్ల పొంగులేటికి ఏమాత్రం విశ్వసనీయత లేదని ఆయన మండిపడ్డారు.
గతంలో కేసీఆర్ను ఆకాశానికెత్తిన పొంగులేటి, ఇప్పుడు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. పదవుల కోసమే పార్టీలు మారుతున్న ఆయనకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కందాళ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.