కడ్తాల్ వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడిగా క్యామ మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో వివేకానంద యువజన సంఘం నూతన అధ్యక్షుడిగా క్యామ మహేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ యువజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోళ్ల రాఘవేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో యువతను సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. ఇదే వేదికపై తెలంగాణ యువజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సిల్వేరు మాధవులును ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు.