నల్ల సముద్రంలో దాడులు ఆమోదయోగ్యం కాదు: తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ హెచ్చరిక

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఇస్తాంబుల్

నల్ల సముద్రంలో పౌర నౌకలపై పెరుగుతున్న దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయిప్ ఎర్డోగన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ తో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దాడులకు పాల్పడుతున్న వారు ఎవరైనా సరే బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. శాంతి చర్చల పునరుద్ధరణకు రష్యా సహా అన్ని దేశాలతో దౌత్యపరమైన చర్చలు జరుపుతామని ఆయన స్పష్టం చేశారు.