రైతన్నలకు తీపి కబురు: వచ్చే వారంలో పీఎం కిసాన్ నిధులు జమ
రిపోర్టర్: రాము
స్థలం: అమరావతి
పీఎం కిసాన్ నిధుల విడుదల తేదీలో మార్పులు జరిగాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దసరా పండుగ సమయంలో వస్తాయని భావించిన ఈ నిధులు వచ్చే వారంలో అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి. కేంద్రం అందించే ఆరు వేలకు తోడుగా ఏపీ ప్రభుత్వం సాయం జతకానుంది. లబ్దిదారులు వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.