మన్యం జిల్లాలో 179 మందికి అంగన్వాడీ నియామక పత్రాలు అందజేత
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: పార్వతీపురం మన్యం
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జరిగిన 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఎన్నికైన 179 మంది అంగన్వాడీ కార్యకర్తలకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నియామక పత్రాలు అందజేశారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ కల్పనకు పెద్దపీట వేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 11 వేల మందికి, మన్యం జిల్లాలో 499 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు.