పోలీస్ పాత్రలో సాయిపల్లవి: ఓం సినిమా ఫస్ట్ లుక్ విడుదల
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
అగ్ర కథానాయిక సాయిపల్లవి తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ధనుష్ హీరోగా నటిస్తున్న ఓం చిత్రంలో ఆమె నిత్యా రెడ్డి పాత్రను పోషిస్తోందని, సోమవారం స్పెషల్ డ్యూటీ పేరుతో ఫస్ట్ లుక్ విడుదల చేశామని తెలిపింది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా నవంబర్ 20న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాతలు స్పష్టం చేశారు.