మస్కట్ లో చిక్కుకున్న మహిళను సురక్షితంగా రప్పించి మాట నిలబెట్టుకున్న కేటీఆర్

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

మస్కట్ లో ఉపాధి మోసానికి గురై చిక్కుకుపోయిన వికారాబాద్ జిల్లాకు చెందిన తుప్పుడు లక్ష్మిని సురక్షితంగా స్వదేశానికి రప్పించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన లక్ష్మి విదేశాల్ లో పడుతున్న కష్టాలను ఆమె కుమారుడు రాజు గతంలో కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కేటీఆర్ చొరవ తీసుకొని అధికారుల ద్వారా సమస్యను పరిష్కరించి లక్ష్మిని సురక్షితంగా రప్పించడంతో ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.