వైఎస్సార్ కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం
రిపోర్టర్: గోపి
స్థలం: Kadapa
వైఎస్సార్ కడప జిల్లాలో పదహారు జడ్పీటీసీ, యాభై ఐదు ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ గురువారం జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఐదు లక్షల తొంబై నాలుగు వేల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే కడప జిల్లా పరిషత్ పీఠాన్ని కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. మిగిలిన స్థానాలపై పట్టు సాధించేందుకు తెదేపా కూటమి, పరువు నిలుపుకునేందుకు వైకాపా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అన్ని కేంద్రాల్ లో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.