తుఫాన్ బీభత్సం: ఏపీలో 126 కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రోడ్లు
రిపోర్టర్: రాము
స్థలం: Amaravati
రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం వల్ల నూట ఇరవై ఆరు కిలోమీటర్ల మేర రోడ్లకు నష్టం వాటిల్లిందని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. శ్రీకాకుళం మరియు తూర్పుగోదావరి జిల్లాల్లో రహదారులు తీవ్రంగా ధ్వంసమయ్యాయని ఆయన వెల్లడించారు. రోడ్లపై కూలిన చెట్లను తొలగిస్తూ రాకపోకలను పునరుద్ధరించేందుకు యాంత్రాంగం వేగంగా సహాయక చర్యలు కొనసాగిస్తోందని చెప్పారు. ఈ మరమ్మతులకు యాభై తొమ్మిది కోట్ల రూపాయలకు పైగా నిధులు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది.