యుపీఎస్సీ సివిల్స్ లో సత్తా చాటిన అంధ యువకుడు అజయ్
రిపోర్టర్: హరి
స్థలం: Kerala
కేరళకు చెందిన అజయ్ ఆర్ రాజ్ చిన్నతనంలోనే కంటిచూపు కోల్పోయినప్పటికీ పట్టుదలతో ముందుకు సాగి సివిల్స్ లో అఖిల భారత స్థాయిలో 109వ ర్యాంకు సాధించినట్లు మీడియా తెలిపింది. సాధారణ ఆటో డ్రైవర్ కుమారుడైన అజయ్ పుస్తకాలే తన లోకమంటూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో విద్యనభ్యసించానని వెల్లడించారు. ఐదుసార్లు కఠిన పరీక్షను ఎదుర్కొని అసాధారణ ప్రతిభతో ఐఏఎస్ సాధించాలనే లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.