తోటపల్లి కుడి కాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
రిపోర్టర్: వెంకట్
స్థలం: సీతానగరం
పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం ఏగోటివలస సమీపంలోని తోటపల్లి కుడి కాలువలో గల్లంతైన హేమంత్ కృష్ణ మృతదేహం బుధవారం లభ్యమైంది. విజయవాడ నుంచి బారసాలకు వచ్చిన ఆయన, కాలువలో స్నానానికి దిగి గల్లంతవడంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. తహసీల్దారు ప్రసన్నకుమార్, ఎస్సై హేమలత ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది మృతదేహాన్ని వెలికితీసి బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.