గంజాయి హాట్‌స్పాట్ ప్రాంతాలపై డ్రోన్లతో పోలీసుల నిఘా
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ఏలూరు
ఏలూరు రూరల్ పరిధిలోని గంజాయి హాట్‌స్పాట్ ప్రాంతాలపై ఈగల్ టీమ్ మరియు ఏలూరు రూరల్ పోలీసులు సంయుక్తంగా డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహిస్తున్నారు. అక్రమ కార్యకలాపాలను అణచివేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.