అమరావతిలో చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ: స్థానిక ఎన్నికల సర్దుబాటుపై కసరత్తు
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ ముగిసిందని అధికారులు తెలిపారు. అమరావతిలోని సీఎం నివాసంలో సాగిన ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల తాజా పరిణామాలు, సీట్ల సర్దుబాటుపై ఇరునేతలు చర్చించారు. నామినేషన్ల గడువు ముగియడంతో కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకం, అసంతృప్తిగా ఉన్న ఆశావహుల సమన్వయంపై స్పష్టమైన దిశానిర్దేశం చేసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, రాష్ట్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలపై కూడా లోతుగా సమీక్షించారు.