పుణేలో దారుణం, గర్భిణీ భార్యను హత్య చేసి దోపిడీగా చిత్రీకరించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

రిపోర్టర్: అశోక్ స్థలం: పుణే

మహారాష్ట్రలోని పుణే జిల్లా దేహుగావ్‌లో మూడు నెలల గర్భిణీ అయిన తన భార్య శుభాంగిని గొంతు కోసి హత్య చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆకాశ్ బరాస్కర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హత్య అనంతరం దొంగలు దాడి చేశారంటూ నమ్మించేందుకు భర్త బిల్డింగ్ పైనుంచి దూకి డ్రామా ఆడాడు. స్థానికులు అందించిన సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, హత్య కేసు నమోదు చేశారు.