ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చంద్రగిరిలో మోహిత్ రెడ్డి విస్తృత పర్యటన
రిపోర్టర్: విజయ్
స్థలం: తిరుపతి
చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విస్తృత పర్యటనలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు స్థానిక ప్రజలతో సమావేశమై వారి ఇబ్బందులను ఓపికగా ఆలకించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాడుతామని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.