ఆసక్తిని రేకెత్తిస్తున్న 'చంద్రయాన్' సినిమా మోషన్ పోస్టర్ విడుదల
రిపోర్టర్: శివ
స్థలం: మంచిర్యాల
మందమర్రికి చెందిన ముగ్గురు యువకులు సొంతంగా రాకెట్ తయారు చేసి చందమామను చేరుకునే ప్రయత్నమే 'చంద్రయాన్' చిత్రం. వేణు ఊడుగుల సమర్పణలో శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కామెడీ అడ్వెంచర్ మూవీ మోషన్ పోస్టర్ తాజాగా విడుదలైంది. శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా కథాంశం ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.