ట్రంప్ గెలుపునకు కమలా హారిస్ వెన్నుపోటే కారణమా?

రిపోర్టర్: విజయ్ స్థలం: World

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం వెనుక కమలా హారిస్ రాజకీయ కుట్ర ఉందని డెమొక్రాటిక్ పార్టీ మాజీ ఇన్‌సైడర్ లిండీ లీ సంచలన ఆరోపణలు చేశారు. జో బైడెన్ రేసు నుంచి తప్పుకోవడానికి ముందే హారిస్ రహస్యంగా ఆయన దాతలను సంప్రదించారని, పార్టీకి తీవ్ర మోసం చేశారని విమర్శించారు.