విజయవాడలో వినాయక నిమజ్జనోత్సవంలో విషాదం సాంబారు పాత్రలో పడి మహిళ మృతి
రిపోర్టర్: రాజేష్
స్థలం: విజయవాడ
విజయవాడలో వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అన్నదాన కార్యక్రమానికి వంట పనులకు సహాయంగా ఉన్న సుజాత (46) అనే మహిళ ప్రమాదవశాత్తు మరిగే సాంబారు పాత్రలో పడిపోయి తీవ్ర గాయాలతో మృతి చెందారు. పొయ్యిపై ఉన్న పెద్ద సాంబారు పాత్రను కిందకు దించే ప్రయత్నం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.