కేసీఆర్, హరీష్ రావు భూ ఆక్రమణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: సిద్దిపేట
తెలంగాణలో కేసీఆర్, హరీష్ రావుల భూ ఆక్రమణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలో ఓవర్ లాప్ ల్యాండ్స్, రంగనాయక్ సాగర్ పరిధిలో భూముల కేటాయింపులపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అధికార దుర్వినియోగం చేసి వందల ఎకరాలు కొల్లగొట్టారని, బాధ్యులైన అధికారులపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.