నిధులు ఇవ్వకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: ఆర్మూర్ ఎమ్మెల్యే
రిపోర్టర్: రాజేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణ శాసనసభలో ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు కేటాయించకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులన్నీ సీఎం నియోజకవర్గం కొడంగల్, మంత్రి సీతక్క నియోజకవర్గం ములుగుకే తరలిపోతున్నాయని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా వెనుకాడనని సభలో స్పష్టం చేశారు.