'ప్రజా వ్యతిరేక నిర్ణయం ఇది': యూపీఐ లావాదేవీలపై రుసుముల పెంపుపై ఎంపీల ఫైర్

రిపోర్టర్: శివ స్థలం: న్యూఢిల్లీ

యూపీఐ లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు (MDR) విధించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండటంపై పార్లమెంటరీ కమిటీ భేటీలో ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారులకు చేసే రూ.2,000 దాటిన యూపీఐ చెల్లింపులపై రుసుము విధించడం పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయమని ఆర్ఎస్పీ ఎంపీ ఎన్.కే. ప్రేమచంద్రన్ దుయ్యబట్టారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించిన ప్రభుత్వం, ఇప్పుడు ఇలాంటి ఛార్జీలు విధించడం వల్ల దేశంలోని సాధారణ ప్రజలు, చిన్న వ్యాపారులు తీవ్రంగా ప్రభావితమవుతారని ఎంపీలు విమర్శించారు. ఈ అంశాన్ని కమిటీ సమావేశంలో లేవనెత్తామని, రాబోయే సమావేశంలో దీనిపై లోతుగా చర్చించే అవకాశం ఉందని పార్లమెంటరీ ఆర్థిక వ్యవహారాల స్థాయీ సంఘం చైర్మన్ భర్తృహరి మహతాబ్ తెలిపారు.