తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తొలిసారిగా విదేశీ కళాకారుల ప్రదర్శనలు

రిపోర్టర్: రాము స్థలం: తిరుపతి

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తితిదే చరిత్రలో తొలిసారిగా విదేశీ కళాబృందాలు ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. జర్మనీ, సింగపూర్‌ల నుంచి ప్రవాస భారతీయులు, విదేశీయులు సొంత ఖర్చులతో తరలివచ్చి స్వామిసేవలో పాల్గొంటున్నారు. ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాల కోసం తితిదే సుమారు 37 లక్షల రూపాయల బడ్జెట్‌ను కేటాయించింది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల కళాకారులతో పాటు విదేశీ వాలంటీర్లు వాహన సేవల ముందు ప్రత్యేక ప్రదర్శనలతో అలరించనున్నారు.