విశాఖలో సందడి చేసిన గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్ టీమ్

రిపోర్టర్: మహేష్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నంలో గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్ చిత్ర బృందం సందడి చేసింది. బీచ్ రోడ్ లోని సాగర్ తీరం ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో 50 మంది నిరుపేద మహిళలకు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, యూట్యూబర్ హర్ష సాయి చేతుల మీదుగా కుట్టు మెషిన్లు పంపిణీ చేశారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ యువత మంచి మార్గంలో నడవాలని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు.