గుజరాత్‌లో దారుణం: ప్రియురాలి భర్తను హతమార్చి ముక్కలుగా నరికిన నిందితుడు

రిపోర్టర్: రాము స్థలం: Gujarat

గుజరాత్ కచ్ జిల్లాలోని అంజార్‌లో ఘోరం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కక్షతో ఓ వ్యక్తి తన ప్రియురాలి భర్త లఖు హుంబాల్‌ను ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి గోనెసంచుల్లో కుక్కి గ్రామ చెరువులో పడవేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు దినేష్ ఠాకూర్‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.