కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రాజెక్టులో కీలక మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
రిపోర్టర్: రాజేష్
స్థలం: Hyderabad
కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ చుట్టూ గతంలో ప్రతిపాదించిన ఫ్లైఓవర్ల నిర్మాణ పనుల్లో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేసిందని పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడించారు. గత ప్రాజెక్టును రద్దు చేసి, రీడిజైన్ బాధ్యతను మేఘా సంస్థకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. నిర్మాణ వ్యయాన్ని భారీగా తగ్గించడంతో పాటు జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి స్టీల్ బ్రిడ్జిని నిర్మిస్తామని అధికారులు స్పష్టం చేశారు.