స్థానిక ఎన్నికల తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ
రిపోర్టర్: సతీష్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసినట్లు ఆ పార్టీ న్యాయవర్గాలు వెల్లడించాయి. వార్డుల విభజన మరియు ఎన్నికల ప్రక్రియకు అనుకూలంగా వెలువడిన హైకోర్టు తీర్పును తప్పుపడుతూ అత్యున్నత ధర్మాసనాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ పిటిషన్పై వెంటనే విచారణ జరపాలని సీజేఐ ధర్మాసనాన్ని వైసీపీ తరఫు న్యాయవాది ప్రత్యేకంగా అభ్యర్థించారు.