ఫొటో ప్రదర్శనలో ఘోర సెన్సార్: చిత్రాలు తొలగించాలంటూ రాయన్ వాద్రాపై వేటు

రిపోర్టర్: అశోక్ స్థలం: ఢిల్లీ

కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ కుమారుడు రాయన్ వాద్రా చేపట్టిన ఫొటో ప్రదర్శనలో ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకున్నట్లు ఆయన ఆరోపించారు. ఢిల్లీలోని బికానెర్ హౌస్లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లో యువత నిరసనలకు సంబంధించిన చిత్రాలను తొలగించాలని డిప్యూటీ రెసిడెంట్ కమిషనర్ మనోజ్ సింగ్ లిఖితపూర్వకంగా ఆదేశించినట్లు రాయన్ వాద్రా వెల్లడించారు. జాతీయ జెండాతో కూడిన ఫొటోలతో సహా మొత్తం డెబ్బై నాలుగు చిత్రాలను తొలగించవలసి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.