ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తూ పరామర్శించిన ప్రభుత్వ సలహాదారు
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
గత వారం రోజులుగా గుండె సంబంధిత ఆరోగ్య సమస్యతో కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు గంట సత్యనారాయణ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె కేశవరావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. అలాగే సకాలంలో మెరుగైన వైద్యం అందించిన సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పిఎల్ఎన్ కాపర్థికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.