ఉమెన్ ఏపీ ప్రిమియర్ లీగ్ లో గోదావరి గోల్డెన్ ఈగల్స్ ఘన విజయం

రిపోర్టర్: సునీల్ స్థలం: Andhra Pradesh

ఉమెన్ ఏపీ ప్రిమియర్ లీగ్‌లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు అమరావతి ఈ-ఛాంపియన్స్‌పై కేవలం 1 పరుగు తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గోదావరి జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన అమరావతి జట్టు చివరి వరకు పోరాడినప్పటికీ 143 పరుగులకే పరిమితమై ఓటమిని చవిచూసింది.