బిచ్కుంద పరిధిలో అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ చోరీల నిందితుడు అరెస్ట్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: కామారెడ్డి

కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ల చోరీల కేసులో సత్నామ్ సింగ్ అనే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ కామారెడ్డి (SP Kamareddy) వెల్లడించారు. బావమరిది షంషేర్ సింగ్తో కలిసి మొత్తం 19 ట్రాన్స్ఫార్మర్ల చోరీలకు పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. నిందితుల నుంచి ద్విచక్ర వాహనం, చోరీ పరికరాలతో పాటు రాగి కాయిల్స్ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.