పాకిస్థాన్‌లో ఘోర ఆత్మాహుతి దాడి పదిహేను మంది మృతి

రిపోర్టర్: రమేష్ స్థలం: World

పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫఖుంఖ్వా ప్రావిన్స్ కోహత్‌లోని ఓల్డ్ పోలీస్ లైన్స్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న మసీదులో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 15 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ప్రార్థనలు జరుగుతుండగా దుండగుడు పేలుడు పదార్థాల వాహనంతో కాంప్లెక్స్ గేటును ఢీకొట్టడంతో ఈ భారీ ప్రమాదం సంభవించింది. సహాయక బృందాలు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా, పలువురి పరిస్థితి విషమంగా ఉంది.