మంత్రి ఇలాకాలో తీవ్ర తాగునీటి కొరతతో గిరిజనుల అవస్థలు

రిపోర్టర్: సురేష్ స్థలం: పాచిపెంట, పార్వతీపురం మన్యం జిల్లా

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పెద్దకచర గ్రామంలో గిరిజనులు తాగునీటి కోసం పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. మంత్రి గుమ్మడి సంధ్యరాణి నియోజకవర్గ పరిధిలోనే ఈ దుస్థితి నెలకొనడం గమనార్హం. ఊట వద్ద నీటిని ఎత్తిపోసుకుని తాగుతున్నామని, ఇలాంటి కలుషిత నీరు తాగితే డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు రావా అంటూ స్థానిక గిరిజనులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.