పోలీసుల ఆంక్షలపై ఆగ్రహంతో ఆదిలాబాద్లో భక్తుల బైఠాయంపు
రిపోర్టర్: సతీష్
స్థలం: ఆదిలాబాద్
ఆదిలాబాద్ పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయని స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడించారు. శోభాయాత్రలో డీజేలు, బ్యాండ్ మేళాలను నిషేధిస్తూ పోలీసులు జారీ చేసిన హుకుంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనగా ప్రధాన అంబేడ్కర్ చౌరస్తాలో వేలాది మంది బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఎస్పీ క్షమాపణ చెప్పే వరకు కదిలేది లేదని స్పష్టం చేయడంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.